టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ మరికొన్ని రోజుల్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతున్న ఈ సినిమా తర్వాత మొదలు అయిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఇప్పటికే పూర్తి అయ్యి రిలీజ్ కూడా అయ్యింది.

గౌతమ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సమయం ఎక్కువ పట్టనున్న నేపథ్యంలో మొదటగా ది ఫ్యామిలీ స్టార్ మూవీ ని పూర్తి చేసి ఆ తర్వాత ఈ సినిమాకు చాలా రోజులను కేటాయించాలి అనే ఉద్దేశం తోనే విజయ్ ముందుగా ది ఫ్యామిలీ స్టార్ సినిమాను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ మూవీ పనులు అన్ని ముగిసి విడుదల కూడా కావడంతో విజయ్ , గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గౌతమ్ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో భాగ్య శ్రీ భోర్సే ను హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. తాజాగా గౌతమ్ ఈమెకు ఈ సినిమా కథను వినిపించగా ... కథ మొత్తం విన్న భాగ్య శ్రీ ఈ సినిమాలో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ కి మరో క్రేజీ తెలుగు సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధిస్తే ఈ బ్యూటీ క్రేజ్ తెలుగు లో మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd