విజయ్ దేవరకొండ కెరియర్ ప్రారంభించిన మొదట్లో వరస విజాయలను అందుకున్నాడు. అలా విజయ్ నటించిన సినిమాలలో చాలా ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడం ... అందులో ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చాలా తక్కువ కాలంలోనే ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఇక ఈయన ఆఖరుగా గీత గోవిందం మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.

ఆ తర్వాత ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం లేదు. ఇక తాజాగా ఈ నటుడు పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమాలో హీరోగా నటించాడు. గీత గోవిందం కాంబోలో రూపొందిన సినిమా కావడంతో మొదటి నుండి ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు కలెక్షన్ లు చాలా తక్కువగా వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన కేవలం మూడు రోజులు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను రాబట్టింది. మొదటి వీకెండ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం కోటి షేర్ కలక్షన్ లను కూడా రాబట్ట లేక పోతుంది. ఈ మూవీ కి భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక ఈ సినిమాకు ప్రస్తుతం వస్తున్న కలెక్షన్ లను బట్టి చూస్తే ఈ మూవీ కి భారీ మొత్తంలో బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో..? ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd