మలయాళ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పలు మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫాహద్ ..'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.'పుష్ప'మూవీ లో పోలీస్ ఆఫీసర్ “భన్వర్ సింగ్ షెకావత్” గా తన యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇప్పుడు 'పుష్ప 2'లో మెయిన్ విలన్ గా ఫాహద్ కనిపించబోతున్నాడు. పుష్ప పార్ట్ 1లో కనిపించింది కొంత సేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫాహాద్ పజిల్ ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇప్పుడు 'పుష్ప 2' లో మరోసారి తన యాక్టింగ్ తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా వున్నాయి.. అయితే తాజాగా 'పుష్ప 2' లో తన రోల్ ఎలా ఉంటుందో ఫాహాద్ ఫాజిల్ స్వయంగా రివీల్ చేశాడు.. 

పుష్ప మూవీ క్లైమాక్స్ లో ఫాహాద్ ఫాజిల్ - అల్లు అర్జున్ మధ్య జరిగిన గొడవను బట్టి పార్ట్ 2లో బన్వర్ సింగ్ క్యారెక్టర్ మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.. తాజాగా ఇదే విషయంపై ఫాహాద్ కి ప్రశ్న ఎదురైంది. ఫాహాద్ ఫాజిల్ ప్రస్తుతం తాను నటించిన 'ఆవేశం' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 2'లో మీ పాత్ర మరింత ఇంట్రెస్టింగ్ ఉండబోతుందా అని ప్రశ్నించగా  పుష్ప 2 లో తన పాత్ర కొత్తరకంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది" అని బదులిచ్చారు.ఇదిలా ఉంటే అల్లు అర్జున్ బర్త్డే సందర్బంగా పుష్ప 2 మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు..ప్రస్తుతం పుష్ప 2 టీజర్ నెట్టింట రికార్డ్ వ్యూస్ తో అదరగొడుతుంది.. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15 న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: