ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో ఒకరు అయినటువంటి తాప్సి రహస్యంగా తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది అని ఓ వార్త వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. అందుకు సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతున్న ఈమె మాత్రం వాటిపై పెద్దగా స్పందించలేదు. ఇక తాజాగా తాప్సి తన పెళ్లి గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. నా పెళ్లి ని ప్రైవేట్ గా చేసుకోవాలనుకున్న కానీ రహస్యంగా కాదు.

నా వైవాహిక జీవితాన్ని పబ్లిక్ లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నా పెళ్లి ఫోటోలు మరియు వీడియోలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు అని తన రహస్య పెళ్లి గురించి ఈ బ్యూటీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ఈమె కొంత కాలం నుండి బ్యాట్మెంటన్ ప్లేయర్ మదియాస్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ ప్రేమించుకుని ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మార్చి 22 వ తేదీన ఉదయపూర్ లో వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం కూడా అతి కొద్ద మంది సన్నిహితుల మధ్య జరిగింది. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు గాని వీడియోలు కానీ ఏవి బయటకు రాలేదు. వాటన్నింటిని తాప్సీనే బయటికి రాకుండా ఉంచినట్లు చెప్పుకొచ్చింది. మరి ఇన్ని రోజుల పాటు పెళ్లి విషయాన్ని తాప్సి బయటికి చెప్పలేదు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. మరి ఇకనైనా ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలను వీడియోలను బయటకు విడుదల చేస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈమె షారుక్ ఖాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఢంకి అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: