బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో విజయ్ ఆంటోనీ దక్కించుకున్నాడు. ఈ మూవీ కంటే ముందు ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో విడుదల అయినప్పటికీ వాటికి గొప్ప గుర్తింపు రాలేదు. అలాగే ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో ఏమీ క్రేజ్ రాలేదు. ఇక తమిళ్ లో సూపర్ హిట్ విజయం సాధించిన బిచ్చగాడు మూవీ ని తెలుగులో విడుదల చేశారు.

పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఒక్క సారిగా విజయ్ కి తెలుగు లో ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. దానితో ఈయన నటించిన చాలా సినిమాలు ఇప్పటికే తెలుగులో విడుదల అయ్యాయి. కాకపోతే విజయ్ నటించిన ఏ సినిమా కూడా బిచ్చగాడు రేంజ్ విజయాన్ని ఇప్పటి వరకు అందుకోలేదు. కొంత కాలం ఈయన "బిచ్చగాడు 2" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ మాత్రం ఈయనకు మంచి విజయాన్ని అందించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు "లవ్ గురు" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ నెల 11 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తనకు మెమరీ పవర్ చాలా తక్కువ అని... ఆ కారణం తోనే ఎంత ప్రయత్నించినా తెలుగు భాష నేర్చుకోలేకపోతున్నాను.

ఒక వేళ నాకు కనుక తెలుగు భాష వచ్చి ఉన్నట్లు అయితే చెన్నై నుండి వచ్చేసి ఇక్కడే తెలుగు లో సినిమాలు చేసేవాడిని అని ఆయన అన్నారు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం హత్య అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. హత్య మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్న ఈ నటుడు "లవ్ గురు" సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

va