మంచి కట్ ఔట్ తో యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గోపీచంద్ చాలా కాలం నుంచి సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయింది.లాస్ట్ టైం వచ్చిన బీమా సినిమా కాస్త పరవాలేదు అనిపించినప్పటికీ కమర్షియల్ గా మాత్రం పూర్తి స్థాయిలో లాభాలను అందించలేకపోయింది.ఇక ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని సీనియర్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల తో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ డైరెక్టర్ శ్రీనువైట్లకు కూడా ఈ మూవీ చాలా కీలకం కానుంది. ఒకప్పుడు దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్టుతో టాప్ డైరెక్టర్ గా కొనసాగిన శ్రీను వైట్లసినిమా తరువాత వరుస ప్లాపులు అందుకున్నాడు.చాలా కాలంగా ఆయన కూడా సక్సెస్ చూడలేదు.కాబట్టి ఈ సినిమాతో ఈ కాంబినేషన్ తప్పనిసరిగా మంచి హిట్ కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇక సినిమా ఫస్ట్ స్ట్రైక్ అంటూ ఒక టీజర్ ని విడుదల చేశారు. 


విశ్వం అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ లో గోపీచంద్ గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లు ఇదివరకే దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక ఈ ఫస్ట్ స్ట్రైక్ లో గోపీచంద్ ఒక గన్నుతో పెళ్లిలోకి వెళ్లి అక్కడ అందర్నీ చంపేసిన విధానం చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.అసలు అందరూ సంతోషంగా పెళ్లి చేసుకుంటున్న సమయంలో గోపీచంద్ ఎందుకు వారందరిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఒకవేళ గోపీచంద్ ఇందులో సీరియల్ కిల్లరా? లేదంటే దీని వెనక ఏమైన బలమైన కారణం ఉందా? అసలు గోపీచంద్ నెగటివ్ షెడ్ లో కూడా కనిపిస్తున్నాడా అనే డౌట్స్  క్రియేట్ చేశారు.గోపీచంద్ మొదట విలన్ గానే బాగా క్లిక్కయ్యాడు. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలతో హిట్లు అందుకొని మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక శ్రీనువైట్ల ఈసారి విశ్వంలో ఎలా చూపిస్తాడో చూడాలి. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ స్ట్రైక్ అయితే బాగానే  ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ మూవీలో ఒక కావ్య థాపర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి సినిమా అంచనాలకు తగ్గట్టుగా హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: