టాలీవుడ్ యువ నటుడు నితిన్ కొంత కాలం క్రితమే వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచిన ఈ నటుడు ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు.

గతం లోనే వీరిద్దరి కాంబోలో భీష్మ అనే మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. దానితో రాబిన్ హుడ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రాశి కన్నా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఇందులో ఈ ముద్దు గుమ్మ పాత్ర నిడివి కాస్త తక్కువ సమయమే ఉన్నప్పటికీ అందులోనే ఈమె ఈ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రాబిన్ హుడ్ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. మరి ఈ సినిమాతో నితిన్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: