టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్య దేవ్ తాజా గా కృష్ణమ్మ అనే సినిమా లో హీరో గా నటించాడు . వి వి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి కొరటాల శివ సమర్పిస్తున్నాడు. ఈ మూవీ ఈ రోజు అనగా మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది . ఈ సినిమా విడుదల సందర్భంగా సత్యదేవ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు . అందులో భాగంగా ఈయన ఓ క్రికెటర్ బయోపిక్ లో నటించాలని ఉన్నట్లు తెలియజేశాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సత్యదేవ్ మాట్లాడుతూ ... ఇండియన్ క్రికెట్ టీం లో ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నారు   . అందులో నాకు అంబటి రాయుడు అంటే ఎంతో ఇష్టం.

ఆయన కెరియర్ లో చాలా అప్స్ మరియు డౌన్స్ ఉన్నాయి . వాటి అన్నింటిని ఎదుర్కొని ఆయన ఇండియన్ క్రికెట్ టీం లో ఎన్నో అద్భుతమైన మ్యాచులను ఆడే తన ఆట తీరుతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . ఎన్నో మలుపులు ఎన్నో సస్పెన్స్ లు కలిగిన అంబటి రాయుడు బయోపిక్ లో నటించాలని ఉంది అని తాజాగా సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే సత్యదేవ్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు ఏవి పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావాన్ని చూపలేదు. దానితో కృష్ణమ్మ సినిమాపై ఈయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరి ఈ మూవీ తో సత్య దేవ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

sd