
ఇప్పుడు తాజాగా రేస్ సర్వే వైసిపి పార్టీ 117 నుంచి 128 సీట్లు దక్కించుకుంటుందంటూ తెలియజేస్తోంది. కూటమి 48 నుంచి 58 స్థానాలు దక్కించుకుంటుందంటూ తెలియజేస్తున్నారు. అయితే కొంతమంది సీనియర్ నేతలు ఇందులో ఓడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీంతో వైసిపి నేతలు కాస్త ఆనందంతో ఉన్నా.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే విషయం పైన ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు అత్యధికంగా వైసిపి పార్టీనే గెలిచే అవకాశం ఉన్నట్లు చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి.
ఇప్పటివరకు వరుసగా సర్వేల ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తూనే ఉన్నాయి. మరి ఏ మేరకు రేస్ సర్వే తెలియజేసిన ఫలితాల మేరకు వైసిపి పార్టీ అధికారం చేపడుతుందో తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. మొత్తానికి అయితే చాలా సర్వేలు వైసిపి వైపే ముగ్గు చూపుతున్నాయి.. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రధానంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇక మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన పథకాలు మళ్లీ కొనసాగిస్తానని చెప్పారు ఈ నేపథ్యంలోనే అటు మహిళలు ఇటు యువత అటు పురుషులు కూడా వైసిపికి అనుకూలంగా మారినట్లు రేస్ సర్వే చెబుతోంది.