బెట్టింగ్స్‌లో ల్యాండ్ పేపర్లు కూడా పెడుతున్నారని తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. జూన్ 4 కౌంటింగ్ తేదీ. దీనికి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. దీని తర్వాత ఇక బెట్టింగ్స్ అన్ని ముగిసిపోతాయి. సో ఈ మూడు రోజుల్లో ఎక్కువ బెట్టింగ్స్ కాసి బాగా డబ్బులు సంపాదించాలని చాలామంది అనుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపుల నుంచి బయట కలుసుకునేదాకా ఏపీలో అతిపెద్ద బెట్టింగ్స్ సాగుతున్నట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పులివెందుల, కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం లాంటి కీలక నియోజకవర్గాల ఫలితాలపై ఎక్కువగా పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల విజయంపై కూడా బెట్టింగ్స్ రాయుళ్ల ఫోకస్ పడినట్లు సమాచారం. పవన్ మెజార్టీపై లక్షకు మూడు లక్షలు నిష్పత్తిలో పందేలు పెడుతున్నారట. కొంతమంది లోకేష్ ఓడిపోతాడని అనుకుంటుంటే.. మిగతా వారందరూ కూడా ఆయన ఈసారి కచ్చితంగా గెలుస్తాడనే నమ్మకంతో బెట్టింగులు పెడుతున్నారు ఒకవేళ లోకేష్ ఓడిపోతే వీరంతా నష్టపోయాయి ప్రమాదం ఉంది. ఏది ఏమైనా తెలుగు మీడియా నిఘాలో ఈసారి ఏపీ ఎన్నికలపై పెడుతున్న బెట్టింగ్ ఐపీఎల్ కి తలదన్నేలా ఉందని వెళ్లడైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి