సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు సినిమాల్లో కలిసి నటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కలిసి నటించిన హీరో హీరోయిన్లలో కొంతమంది అటు ప్రేక్షకులందరికీ కూడా ఫేవరెట్ జోడీగా మారిపోతూ ఉంటారు. ఇక ఆ హీరో హీరోయిన్ కాంబినేషన్ లో ఎప్పుడు మూవీ వచ్చిన కూడా భారీ అంచనాల నెలకొంటూ ఉంటాయి అని చెప్పాలి. గతంలో ఇలా ప్రేక్షకుల ఫేవరెట్ జోడీస్ గా మారిన హీరో హీరోయిన్ జంటలు చాలానే ఉన్నాయి.


 ఇక నేటి జనరేషన్ కి ప్రభాస్ అనుష్క జంట కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ గా మారిపోయిన ఫేవరెట్ జోడి ఏదైనా ఉంది అంటే అది విజయ్ దేవరకొండ, రష్మిక జంట అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి మొదటిసారి గీతాగోవిందం అనే మూవీలో నటించారు. ఇక ఈ మూవీ  బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే మూవీలోను కలిసిన నటించారు. ఈ మూవీ హిట్ అవ్వకపోయినా విజయ్, రష్మిక కెమిస్ట్రీ మాత్రం బాగా వర్క్ అవుతుంది. దీంతో వీరిద్దరి జోడి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఫేవరెట్ జోడీగా మారిపోయింది అని చెప్పాలి.



 ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల తర్వాతగా ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ, రష్మిక జోడి వెండితెరపై మరోసారి మెరువనున్నట్లు సమాచారం. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రౌడీ హీరో ఒక మూవీ చేయడానికి రెడీ అయ్యాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మూవీలో రష్మిక మందన్నను హీరోయిన్గా సెలెక్ట్ చేశారట. 18వ దశాబ్దంలో జరిగిన చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడట డైరెక్టర్. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఇటీవలఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: