నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాణ్యం ఒకటి. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి, టీడీపీ కూటమి నుంచి గౌరు చరితా రెడ్డి పోటీ పడ్డారు. ఓర్వకల్లు, కల్లూరు, గడివేముల, పాణ్యం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 322,799.
అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ టిడిపి అభ్యర్థి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు రెండో రౌండ్ మూసేసరికి ఏయే పార్టీలు ఎన్ని ఓట్లు గెలుచుకున్నాయో చూద్దాం.
వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి - 9362
టీడీపీ గౌరు చరితా రెడ్డి - 14117
సీపీఎం - 245
రెండో రౌండ్ మూసేసరికి 4,755 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు టీడీపీ అభ్యర్థి గౌరు చరిత. మూడవ రౌండ్లో 6918 ఓట్లతో ఆదిత్యంలో దూసుకుపోతున్న నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి.
గౌరు చరితారెడ్డి 2014లో పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గతంలో, ఆమె 2004-2009 వరకు నందికొట్కూరుకు, 2014-2019 వరకు పాణ్యంకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏపీలో మహిళా, శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆమె భర్త గౌరు వెంకట రెడ్డి కూడా రాజకీయ నాయకుడు.
కాటసాని రాంభూపాల్ రెడ్డి 2019 ఎన్నికల్లో పాణ్యం నుంచి విజయం సాధించారు. గతంలో 1985, 1989, 1994, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పాణ్యం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన ఓడిపోయే లాగానే కనిపిస్తోంది ప్రస్తుతం రెండు రౌండ్లలో అయితే ఆయన వెనుకంచిలో ఉన్నారు మరి ముందు రౌండ్లలో కాటసాని ఏమైనా పుంజుకునే అవకాశం ఉందో చూడాలి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడమే ఓడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్ని సంక్షేమ పథకాలను అందించిన ప్రజలు మాత్రం వైసీపీ కి ఓటు వేయకపోవడం నిజంగా విస్మయకరం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి