ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి అటు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 17 పార్లమెంట్ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లోని ఓట్లనే ముందుగా లెక్కిస్తారు. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో హీరోలుగా నిలవబోయేది ఎవరు అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ ఉంది. అయితే మొత్తంగా రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలలో కలుపుకొని 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలోనే ఉదయం 8 గంటల నుంచి ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లనే లెక్కించబోతున్నారు అధికారులు.
ఇక ఇలా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేశారు అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కింపు మొదలైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును మొదలుపెడతారు అధికారులు. ఈ క్రమంలోనే కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచేలా భద్రత, 144 సెక్షన్ విధించారు అధికారులు. ఈ క్రమంలోనే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి అనుకూలంగా రాకపోతున్నాయి..ఎవరికి మెజారిటీ అందించబోతున్నాయి అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ ఉంది. మరి కొంత సేపట్లో దీనిపై స్పష్టత రాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి