ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెళ్లడవుతున్నాయి. వైసీపీ భారీ మెజారిటీతో మళ్ళీ గెలుస్తుందని చాలామంది అంచనా వేశారు కానీ దానికి ఇప్పుడు మొత్తం రివర్స్ గా కనిపిస్తోంది. టీడీపీ 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడింగ్ లో ఉంది వైసీపీ 20కే పరిమితమైంది. ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థులు పూర్తిగా ఓడిపోయినట్టు తెలుస్తోంది. ఈ వైసీపీ మంత్రులు ఫలితాల్లో పుంజుకోనంత విధంగా వెనకబడ్డారు.  

మంత్రులు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా, బుగ్గన,  చెల్లుబోయిన వేణు, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, జోగి రమేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పార్లమెంటు ఎన్నికల లెక్కింపులో టీడీపీ మంత్రుల కంటే చాలా తక్కువ ఓట్లను సాధించారు. మాజీ మంత్రి కొడాలి నాని కూడా వెనుకంజలో ఉన్నారు. పుంగునూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం వెనుకంజలో ఉండటం పెద్ద షాక్ ఇస్తోంది. ఇలాంటి ప్రతికూల ఫలితాల కారణంగా వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్లిపోయారని సమాచారం. జనసేన పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లో కూడా ఆధిక్యంలో ఉంది. అలాగే పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో కూడా లీడింగ్ లో ఉంది.

అసెంబ్లీలోనే కాకుండా టీడీపీ కూటమి పార్లమెంటు స్థానాల్లో కూడా పూర్తిగా హవా కనబరుస్తోంది. రాయలసీమ అనేది వైసీపీకి కంచుకోట కానీ ఈసారి మాత్రం టీడీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఎన్‌డీఏ ఏపీలో ఈసారి విజయ బావుటా ఎగరవేయటం ఖాయమని తెలుస్తుంది. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో చాలానే సంక్షేమ పథకాలను అందించింది కానీ ఈసారి ఈ పార్టీకి ఎదురుగాలి తగిలినట్లు తెలుస్తోంది. టిడిపి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు బాగా కలిసి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అలాగే పొత్తు, జగన్ చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మంత్రులను మార్చడం కూడా పెద్ద మైనస్ అయిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: