హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది. తమన్నా భాటియా పెళ్లి కాకుండానే తల్లి కానుందన్న న్యూస్ కాకరేపుతుంది. ఈ మేరకు బాలీవుడ్ లో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. తమన్నా చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.తమన్నా భాటియా చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. సుదీర్ఘ కాలంగా ఆమె వెండితెరను ఏలుతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా సౌత్ ఇండియా మొత్తం ఫేమ్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో కూడా చిత్రాలు, సిరీస్లు చేస్తుంది.

తెలుగులో తమన్నా ఫేమ్ తగ్గగా ఎక్కువగా వెబ్ సిరీస్ల మీద ఫోకస్ చేస్తుంది. గత ఏడాది లస్ట్ స్టోరీస్ 2, జి కర్దా వంటి సిరీస్లు చేసింది. బోల్డ్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటిస్తుంది. నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ 2 లో జతకట్టిన ఈ జంట ప్రేమలో పడ్డారు.మొదట్లో తమ ఎఫైర్ రూమర్స్ తమన్నా, విజయ్ వర్మ ఖండించారు. అనంతరం క్లారిటీ ఇచ్చారు. అవును మేమిద్దరం లవ్ లో ఉన్నామని ఒప్పుకున్నారు. ఓపెన్ అయ్యాక చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఏకాంతంగా విహారాలకు చెక్కేస్తున్నారు. పలుమార్లు ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు.ఈ ఏడాది తమన్నా-విజయ్ వర్మ పెళ్లి పీటలు ఎక్కుతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. తమన్నా పెళ్ళికి ముందే తల్లి కావాలని నిర్ణయం తీసుకుందట. ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారట. ఒక బిడ్డ పుట్టాక వారి బాధ్యతల పట్ల మరింత స్పష్టత వస్తుందట.
అందుకే బిడ్డ కలిగాక కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంటే తమ బంధం మీద మరింత క్లారిటీ వస్తుంది. బలపడుతుందని అనుకుంటున్నారట. విజయ్ వర్మ-తమన్నా మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో తమన్నా పెళ్ళికి ముందే గర్భం దాల్చనుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.ఈ మధ్య ఈ కల్చర్ ఎక్కువైపోయింది. అలియా భట్ పెళ్ళికి ముందే గర్భం దాల్చింది. అనంతరం రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ఇలియానా కూడా సహజీవనం చేసి తల్లి అయ్యింది. ఆమె భర్త ఎవరో ఎప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. వీరిని తమన్నా కూడా ఫాలో అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: