నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అదిరిపోయే ప్లాన్‌ తో ముందుకు సాగుతుంది. అక్కడ గట్టిగా జెండా పాతే ప్రయత్నం చేస్తుంది. కుర్రభామలకు పాఠాలు నేర్పిస్తుంది.నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నెమ్మదిగా తనని తాను నటిగా మలుచుకుంటూ వస్తోంది. ఒకేసారి సునామీలా కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకు బేస్‌ని ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది. సక్సెస్‌ చిత్రాల్లో భాగమవుతూ దూసుకుపోతుంది. కెరీర్‌ ప్రారంభించిన తక్కువ సమయంలోనే పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. భారీ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతూ హీరోయిన్‌గా, నటిగా బలంగా బేస్‌ వేసుకుంటుంది. సౌత్‌ టూ నార్త్‌ ఎక్కడైనా జెండా పాతే ప్లాన్‌ చేస్తుంది.రష్మిక మందన్నా కెరీర్‌ పరంగా సేఫ్‌ గేమ్‌ ఆడుతుంది. కెరీర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఓ వైపు కమర్షియల్‌ చిత్రాలు చేస్తుంది. భారీ కంటెంట్‌ ఉన్న చిత్రాల్లో బలమైన పాత్రల్లో మెరుస్తుంది. కమర్షియల్‌ హీరోయిన్‌ తరహా పాత్రలు కూడా చేస్తుంది. దీంతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ భాగమవుతూ సేఫ్‌ గేమ్‌ ఆడుతుంది. అన్ని రకాలుగా కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అన్నింటిలోనూ తాను రాణించగలను అనే సందేశాలను మేకర్స్ కి అందిస్తుంది.

 రష్మిక మందన్నా కిర్రిక్‌ పార్టీ`తో కన్నడలో కెరీర్‌ని ప్రారంభించి రెండేళ్లలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. `ఛలో చిత్రంతో హిట్‌ అందుకుని గీత గోవిందం`తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టి స్టార్‌ అయ్యింది. `భీష్మ, సరిలేరు నీకెవ్వరు`తో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. `పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి అక్కడ మొదటి రెండు చిత్రాలతో దెబ్బలు తిన్నా, `యానిమల్‌`తో మాత్రం గట్టిగా కొట్టింది.యానిమల్‌ చిత్రం రష్మిక నార్త్ లో గట్టి పాత్‌ని ఏర్పాటు చేసింది. ఇక తిరుగులేదనే భరోసా ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా మరో సంచలన ఆఫర్‌ అందుకుంది. ఏకంగా సల్మాన్‌ ఖాన్‌తో నటించే అవకాశాన్ని అందుకుంది. సల్లూభాయ్‌ ప్రస్తుతం సికందర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఎంపికైంది రష్మిక మందన్నా. దీనికి మురుగదాస్‌ దర్శకుడు కావడం విశేషం. సల్మాన్‌కి నార్త్ లో భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. దీంతో వారంతా రష్మిక ఫ్యాన్స్ అయిపోతారు. ఆమె ఫాలోవర్స్ గా మారిపోతారు. ఇది ఆమె క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని మరింతగా పెంచుతుందని చెప్పొచ్చు. ఇలా సౌత్‌ టూ నార్త్ తిరుగులేని నటిగా మారుతుంది రష్మిక. బాలీవుడ్‌ భామలని కూడా మించిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే కమర్షియల్‌ సినిమాలే కాదు, అందులో ఆమె పాత్రలు కూడా బలంగా ఉండేలా చూసుకుంటుంది. యానిమల్‌`లోనూ ఆమె పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. ఇక `పుష్ప`లోనూ శ్రీవల్లిగా రచ్చ చేసింది రష్మిక. ఇప్పుడు `పుష్ప2`తో మరోసారి తానేంటో చూపించేందుకు వస్తుంది. `కుబేర`లోనూ హీరోయిన్‌గా మెప్పిస్తుంది. మరోవైపు `ది గర్ల్‌ ఫ్రెండ్‌, రెయిన్‌బో అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది రష్మిక. ఇలా అన్ని యాంగిల్లోనూ తన బలంగా పునాది వేసుకుంటుందని చెప్పొచ్చు.రష్మిక మందన్న ఇప్పుడు యంగ్‌ హీరోయిన్స్ కి ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తుంది. ఒకేసారి వచ్చామా. వెళ్లామా అనే కాకుండా క్రమంగా తన స్థాయిని పెంచుకుంటుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కానీ ఇటీవల కాలంలో కృతి శెట్టి, శ్రీలీల వంటి భామలు ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయారు. కుప్పలు కుప్పలుగా సినిమాలు ఒప్పుకుని వరుసగా ఆరేడు సినిమాలు చేసి బోల్తా కొట్టారు. ఎంత వేగంగా వచ్చారో, అంతే వేగంగా వెళ్లిపోయారు. కొత్తగా వస్తున్న హీరోయిన్లు కూడా ఇలానే ఉన్నారు. అందుకే ఒకటి రెండు సినిమాలకే కనుమరుగు అవుతున్నారు. ఈ విషయంలో రష్మికని స్ఫూర్తిగా తీసుకుని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆఫర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తే మంచి భవిష్యత్‌ వారి సొంతం అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: