టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సెకండ్ మూవీ లవ్ మీ. హారర్ లవ్ జానర్ లో సరికొత్తగా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది.ఇక ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు కూడా యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు తెరపైకి తీసుకు వస్తున్న ఈ మూవీని దిల్ రాజు అనుబంధ సంస్థ అయిన దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలు కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. లవ్ మీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను  విడుదల చేశారు. ఏదైనా చేయొద్దు అంటే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేసే హీరో అయిన అర్జున్ అనే క్యారెక్టర్ లో ఆశిష్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు.టైం ఎనిమిది దాటితే ఒక అల్లారం మోగుతుంది. ఇక తర్వాత ఒక ఒక అమ్మాయి ఒక బంగ్లా వైపు తిరిగి చూడడంతో బాగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక హీరో అర్జున్ అదే బంగ్లాలోకి వెళ్లాలనుకుంటాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ దెయ్యం గురించి ఎన్నో విషయాలు అతనికి తెలుస్తాయి.


ఇక ఆ దెయ్యం ఇప్పటికే చాలామందిని చంపేసిందని నిన్ను కూడా చంపేస్తుందని అతని స్నేహితులు చెప్పినప్పటికీ కూడా హీరో ఏమాత్రం వెనుకడుగు వేయడు.మొత్తానికి దెయ్యంతో లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది అనే పాయింట్ ను ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. మొత్తానికి ట్రైలర్  కొన్ని విజువల్స్ తో అలాగే డిఫరెంట్ సీన్స్ తో చాలా ప్రత్యేకంగా ఉంది. ఇక ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాపై  అంచనాలను పెంచుతుంది.ఇక ఈ సినిమాలో బేబీ సినిమాతో వైరల్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీని గత వారమే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మళ్లీ సినిమాని వాయిదా వేశారు. ఇక మే 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అఫీషియల్ గా మరోసారి క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా వచ్చిన మరొక టాక్ ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ నిర్వహిస్తూ ఉండడంతో బహుశా ఈ మూవీని మళ్ళీ వాయిదా వేయవచ్చు అనేలా కొన్ని గాసిప్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ మూవీని అనుకున్న టైమ్ కి విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: