టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి తేజ సజ్జ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లాంచింగ్ డే రోజు ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను మేకర్స్ విడుదల చేయగా అది చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. రితికా నాయక్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న మంచు మనోజ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న మంచు మనోజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మే 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. తాజాగా మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు సంబంధించిన ఈవెంట్ వేదికను ఖరారు చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.  మే 20 వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకి AAA సినిమాస్ లో ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమాలో మనోజ్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను మూవీ యూనిట్ తెలిపే అవకాశం చాలా వరకు ఉంది.

సినిమా లోని మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే తేజ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దానితో మిరాయ్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో ఈ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mm