సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 70 కి పైగా వయసు ఉన్నప్పటికీ కూడా తగ్గేదేలేదు అంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. నిజానికి చెప్పాలంటే చిన్న చిన్న స్టార్ హీరోలే ఏడాదిలో ఒక సినిమా చేసి సరిపెట్టుకుంటే రజినీకాంత్ మాత్రం ఒక ఏడాదిలోనే రెండు సినిమాలు విడుదల చేసి మూడో సినిమా కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేసేసారు. గతేడాది లో రజనీకాంత్ నటించిన "జైలర్" మూవీ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుదో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 ఇదిలా ఉంటే రజినీకాంత్ "వెట్టయన్" సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్స్  టీజె జ్ఞానవెల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, దుఫార విజయం, రితిక సింగ్, మంజు వారియర్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు అనిరుద్ రవి చందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు భారీ

 ధరకు అమ్ముడు పోయాయని  తాజాగా మేకర్స్  ప్రకటించారు. ఈ సినిమా యొక్క డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ తమిళ నెట్వర్క్ ఛానల్ వారు రూ:65 కోట్లకు మరియు డిజిటల్ హక్కులను రూ:90 కోట్లకు కొనుగోలు చేశారట. ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక నెల తర్వాత ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ,అమెజాన్ ప్రైమ్ వెబ్సైట్లో విడుదల చేయబోతోంది అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. అయితే ఈ మూవీ అక్టోబర్ 10న  రిలీజ్ కాబోతోంది.  ఇదిలా ఉంటే రజినీకాంత్ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.  ఈ మూవీ ట్రైలర్ మరియు ఆడియో లాంచ్ గురించి మేకర్స్ ఇంకా అప్డేట్ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: