ప్రముఖ హిందీ నటి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన దబాంగ్ సిరీస్ మూవీలతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ఇప్పటికే ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. కొంతకాలం క్రితమే ఈమె సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన హిరామండి అనే వెబ్ సిరీస్ లో  నటించింది.

ఈ వెబ్ సిరీస్ లో వేశ్య పాత్రలో నటించిన ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లో తన ప్రియుడు అయినటువంటి    జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి వివాహం జూన్ 23 వ తేదీన ముంబై లో ఎంతో గ్రాండ్ గా జరగబోతున్నట్లు అనేక వార్తలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. సోనాక్షిపెళ్లి చేసుకోవడానికి తన తల్లి ఇంకా సోదరుడు అంగీకరించలేదు అని అనేక వార్తలు కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి.

అలాగే తన తల్లి మరియు సోదరుడు ఈ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో వారిద్దరిని కూడా సోనాక్షి సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసింది అని కూడా బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలు అన్ని రూమర్స్ అని సోనాక్షి తాజాగా ప్రూవ్ చేసింది. తన పెళ్లికి ఇద్దరినీ ఆశీర్వదించడానికి ఇద్దరు కుటుంబాల పెద్దలు కూడా నిన్న గురువారం రాత్రి కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని ఇప్పుడు తేలిపోయింది. అలాగే ఇద్దరు ఫ్యామిలీలు కలిసి ఎంతో హ్యాపీగా గడుపుతున్న కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కూడా ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: