గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరో నాగచైతన్య సరైన సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటించిన డైరెక్టర్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ వారు కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ చిత్రంతో నాగచైతన్య కచ్చితంగా సక్సెస్ అందుకుంటాడని అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా డైరెక్టర్ హార్డు వరకు చైతన్య హార్డు వరకు ప్లస్ అవుతుందని తెలుపుతున్నారు.


అయితే తాజాగా ఈ సినిమా షెడ్యూల్ విశాఖపట్నంలో పూర్తి అయ్యింది. దీంతో కొద్దిరోజులు బ్రేక్ తీసుకొని రెండవ షెడ్యూల్ ని హైదరాబాద్ ఢిల్లీలో జరుపబోతున్నారు. ఒక ఫైట్, రెండు పాటలు కూడా సినిమా షూటింగ్ ఫైటింగ్ సన్నివేశాలు జరిపే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. సంగీతాన్ని కూడా దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. తండేల్ సినిమాకి సంబంధించి పనులు కూడా శరవేగంగానే పూర్తీ అవుతున్నాయి.. అయితే అసలు సమస్య ఏమిటంటే విడుదల తేదీకి వచ్చిన సమస్య అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


అసలు విషయంలోకి వెళ్తే డిసెంబర్ 20తేదీన ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నప్పటికీ.. డిసెంబర్ మొదటి వారంలో అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా విడుదల తేదీ ప్రకటించారు. తండేల్ సినిమాకి ఇది ఒక షాకింగ్ ల తగిలింది.. ఇదంతా ఒకే ఎత్తు అయితే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కూడా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి తండేల్ సినిమా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజులలో ఈ సినిమా విడుదల కాబోతోందని అభిమానులు అనుకున్నప్పటికీ ఒక్కసారిగా ఇది షాకింగ్ విషయం అని చెప్పవచ్చు. మరి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: