నందమూరి నట సింహం బాలకృష్ణ వరుసగా అఖండ , వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి మూవీ లతో విజయాలను అందుకున్నాడు. ఇక వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీతో సూపర్ సక్సెస్ను అందుకున్న బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా బాలయ్య కెరియర్లో 109వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ను ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది.

మూవీ బృందం ఈ సినిమా షూటింగ్లో స్టార్ట్ చేసి చాలా కాలమే అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. దానితో ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు గ్లిమ్స్ వీడియోలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే నిన్న ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బాబి పుట్టిన రోజు దానితో ఈ మూవీ బృందం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో బాబి నటులకు ఇస్తున్న సూచనలతో కూడిన ఒక వీడియోను బాబీ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.

అందులో బాబీతో  పాటు అనేక మంది ఎన్బికె 109 సినిమాలో నటిస్తున్న నటీనటులు , టెక్నీషియన్స్ కూడా కనిపించారు. ఇక ఈ వీడియో కూడా అద్భుతమైన స్థాయిలో ఉంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన అన్ని వీడియోలు అద్భుతమైన స్థాయిలో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే బాలయ్య అభిమానులు ఈ వీడియోల కంటే కూడా ఈ సినిమా టైటిల్ , విడుదల తేదీలను ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అనే దానిపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. వాటిని విడుదల చేస్తే ఇంకా బాగుంటుంది అని అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk