మన ఇండియాలో ఇతర భాషల సినిమాలకు వెబ్ సిరీస్‌లకు కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా కొరియన్ సిరీస్ లకు సిరీస్‌లకు అయితే ఇంకా మంచి డిమాండ్ ఉంది. ఇక సూపర్ హిట్ కొరియన్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ని ఇంగ్లీషులో కూడా డబ్ చేయడం జరిగింది. దీన్ని సిరీస్ చూసిన ప్రేక్షకులు చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యారు. ఈ సిరీస్ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సిరీస్‌కి సీక్వెల్ కూడా రాబోతోంది. 'స్క్విడ్ గేమ్ 2' సిరీస్ డిసెంబర్ 26 వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇంకా 'స్క్విడ్ గేమ్ 3' సిరీస్ కూడా రాబోతోంది. ఇది 2025లో వచ్చే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.ఫస్ట్ సీజన్ సెప్టెంబర్ 2021లో స్ట్రీమింగ్ మొదలైంది. మొదటి సీజన్ ముగింపులో రెండవ సీజన్‌కు లింక్ ఇచ్చారు. 


దాంతో ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండో సీజన్ కూడా రాబోతోంది. చివరి సీజన్ 2025 వ సంవత్సరంలో స్ట్రీమింగ్ కానుంది. హ్వాంగ్ డాంగ్ హ్యూక్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సిరీస్‌లో కొరియన్ స్టార్ లీ జంగ్ జీ ప్రధాన పాత్రలో నటించారు.లే బైయుంగ్ హున్ ఇందులో ఒక రహస్యమైన ఫ్రంట్‌మ్యాన్‌గా కనిపించాడు. ఇంకా వై హా జున్ అలాగే గాంగ్ యూ సిరీస్‌తో తిరిగి రానున్నారు. 'స్క్విడ్ గేమ్ 2' టీజర్ చూస్తుంటే రన్నింగ్ రేస్ లాగా ఉంది. 'ఇప్పుడు అసలైన ఆట ప్రారంభం' అని క్యాప్షన్ ని దీనికి ఇచ్చారు. 'స్క్విడ్ గేమ్' ఆడండి లేదా చావండి అంటూ మొదటి సీజన్‌లో 456 మంది ఈ గేమ్ లో పాల్గొంటారు. ఈ ఆటలో ఓడిపోతే చంపేస్తారు. చివరికి ఒక్కరంటే ఒక్కరే బతుకుతారు. ఇలా ఫస్ట్ సీజన్ వచ్చింది. రెండవ సీజన్‌లో ఎలాంటి గేమ్‌లు రానున్నాయి? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: