తమిళ నటుడు సూర్య హీరోగా నయన తార , అసిన్ హీరోయిన్లుగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన గజినీ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయ్యి రెండు భాషలలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాను చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారు. ఇక అజిత్ ఏకంగా ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టి ఆ తర్వాత ఆపేశాడు. అసలు ఈ సినిమాలో ఎంత మంది హీరోలు రిజెక్ట్ చేశారు.

అజిత్ ఎందుకు ఈ సినిమా షూటింగ్ నీ మొదలు పెట్టి ఆపేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. ఏ ఆర్ మురగదాస్ ఈ సినిమా కథను పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మహేష్ బాబుకు వినిపించాడట. కాకపోతే మహేష్ బాబు ఈ సినిమా చేయను అని చెప్పాడట. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో స్టార్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ కు కూడా ఈ సినిమా కథను వినిపించారట. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా చేయను అని అన్నాడట.

ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి కమల్ హాసన్ కు కూడా ఈ స్టోరీని వినిపించగా ఆయన కూడా చేయను అని అన్నాడట. ఇక అజిత్ కి ఈ సినిమా స్టోరీ వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ తర్వాత శ్రేయ , ఆసిన్ చేయాలను హీరోయిన్లుగా తీసుకొని ప్రకాష్ రాజు విలన్ గా ఈ సినిమాను మొదలు పెట్టారట. నాలుగు రోజుల షూటింగ్ పూర్తి అయ్యాక ఎందుకో గాని అజిత్సినిమా చేయట్లేదు అని ప్రకటించాడు. దానితో మురుగదాస్ , సూర్య హీరోగా ఈ సినిమాను గజిని అనే పేరుతో తెరకెక్కించడం , ఇది విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: