టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సుమంత్ ఒకరు. సుమంత్ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కు మేనల్లుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకున్నాడు. ఈయన నటించిన సత్యం , గౌరీ , గోదావరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాల ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. గౌరీ సినిమా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొంది మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు మాస్ ఈమేజ్ దక్కింది.

ఇక సత్యం , గోదావరి సినిమాలు క్లాస్ ఎంటర్టైనర్ మూవీ లుగా రూపొంది మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూవీ ల ద్వారా ఈయనకు సూపర్ క్రేజ్ లభించింది. కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకున్న ఈయనకు ఆ తర్వాత మాత్రం అనుకున్న స్థాయి విజయాలు దక్కలేదు. దానితో ఈయన కెరియర్ మెల్ల మెల్లగా పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఈయనకు భారీ ఆఫర్లు కూడా ఏమీ లేవు. అప్పుడప్పుడు సుమంత్ కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.

ఇకపోతే సినిమాల విషయం పక్కన పెడితే ఈయనకు భారీ మొత్తంలో ఆస్తులు మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. సుమంత్ కి తన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా కోట్ల ఆస్తి వచ్చినట్లు , అలాగే ఈయన ఏఎన్నార్ మనవడు కావడంతో చిన్న వయసు నుండి ఆయన ఏఎన్ఆర్ దగ్గరే ఎక్కువ కాలం ఈయన ఉండడంతో ఏఎన్నార్ ఈయనకు బంజారా హిల్స్ లో 100 కోట్ల విలువైన ప్రాపర్టీని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏఎన్ఆర్ గారు ఉన్న సమయం లోనే దీని విలువ 100 కోట్లు అని ఇప్పుడు దాని విలువ చాలా పెరిగినట్లు తెలుస్తోంది. అలా సుమంత్ కి తన తల్లిదండ్రుల నుండి తాత గారి దగ్గర నుండి కలిపి వందల కోట్లలో ఆస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: