నేషనల్ ఫిలిం అవార్డు.. ఈ పురస్కారాన్ని ఒక్కటేనా గెలుచుకోవాలని సినిమా రంగంలో అడుగుపెట్టిన ప్రతి యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అవి అంత ప్రతిష్ఠాత్మకమైవి. ఒకరి ప్రతిభకు సింబల్ లాగా ఈ అవార్డ్స్ నిలుస్తూ ఉంటాయి. అయితే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం (ఆగస్టు 16) 2022, డిసెంబరు 31లోపు సెన్సార్ పూర్తయిన చిత్రాలకు గానూ నేషనల్ అవార్డ్స్ ప్రకటించింది. పోయినసారి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆరు నేషనల్ ఫిలిం అవార్డ్స్ సొంతం చేసుకుంది కానీ ఈసారి ఒక్క అవార్డుకే పరిమితమైంది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమా బెస్ట్ రీజనల్ మూవీ కేటగిరీలో నేషనల్ అవార్డ్ గెలుచుకుంది.
ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మలయాళ, తమిళ సినిమాలు ఈసారి ఈ అవార్డుల్లో పూర్తిగా డామినేషన్ చూపించాయి. సంగతి పక్కన పెడితే నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న సినిమాలు ఎక్కడ, ఏయే ఓటీటీల్లో చూడవచ్చో తెలుసుకుందాం.
* నేషనల్ బెస్ట్ ఫిలిం అవార్డు అందుకున్న మలయాళ సినిమా ‘ఆట్టమ్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని మనవాళ్లు కూడా చూసేయవచ్చు.
* ‘కాంతార’ సినిమాలో అద్భుతంగా నటించినందుకుగాను బెస్ట్ యాక్టర్‌గా రిషబ్ శెట్టికి అవార్డు లభించింది. అతని యాక్టింగ్ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్న కాంతారా సినిమాను చూడవచ్చు. ఇది కూడా తెలుగులో ప్రసారం అవుతోంది.
* నిత్యా మీనన్ నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్‌గా నిలిచింది. ‘తిరు’ సినిమాలో ఆమె చూపించిన చక్కని నటనకు ఈ అవార్డు లభించింది. ఈ మూవీని సన్ నెక్స్ట్లో వీక్షించవచ్చు. తెలుగు లోనూ ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది
* ‘కచ్ ఎక్స్‌ప్రెస్’ మూవీ మానసి పరేఖ్ ను బెస్ట్ యాక్ట్రెస్‌గా నిలిపింది. దీన్ని "షీమారో మీ" ఓటీటీ యాప్‌లో చూడవచ్చు.
* ఇక కార్తికేయ 2 (తెలుగు) మూవీ జీ5 ఓటీటీలో వీక్షించవచ్చు.
* పొన్నియిన్ సెల్వన్-1 తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.
* విజువల్ ఎఫెక్ట్స్, ప్లే బ్యాక్ సింగర్ తదితర కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్న ‘బ్రహ్మస్త్ర’ సినిమాని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూసేయవచ్చు.
* అలానే సౌది వెళ్లక్క సీసీ 225య/2009 (మలయాళ) చిత్రం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
* వాల్వీ (మరాఠీ).. అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
* ‘మలికాపురమ్’ సినిమాలో అద్భుతంగా నటించిన శ్రీపాథ్ కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ లభించింది ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు.
* బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో ‘కేజీఎఫ్ 2’ అవార్డ్ అందుకుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.
* బెస్ట్ మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకున్న బెంగాలీ సినిమా ‘అపరాజితో’ని జీ5లో చూడొచ్చు.
అంతేకాకుండా ఈసారి పురస్కారాలు అందుకున్న కబేరి అంతర్జాన్ (బెంగాలీ).. జియో సినిమాలో, గుల్ మోహర్ (హిందీ)ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో, ‘ఊంచాయ్’ని జీ5లో "ఆడు జీవితం" సినిమాని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి