కొన్ని సంవత్సరాల క్రితం శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు "శతమానం భవతి" అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే దిల్ రాజు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ... శతమానం భవతి స్టోరీ విన్న తర్వాత దానిని సాయి ధరమ్ తేజ్ తో చేయాలి అనుకున్నాను. ఆయనను వెళ్లి కలిశాను. కాకపోతే నేను ఆ సినిమాని కచ్చితంగా సంక్రాంతి కి రిలీజ్ చేయాలి అనుకున్నాను. సినిమా కథ మొత్తం విన్నాక సాయి తేజ్ కి బాగానే ఉంది. కాకపోతే నేను ప్రస్తుతం రెండు సినిమాలకు ఒప్పుకొని ఉన్నాను అన్నాడు.
దానితో సాయి తేజ్ తో ఆ సినిమా చేస్తే సంక్రాంతి కి రిలీజ్ కావడం కష్టం. ఇక మరో రకంగా చూస్తే ఆ సంవత్సరం సంక్రాంతి కి చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 మూవీ కూడా సంక్రాంతి కి విడుదలకు రెడీగా ఉంది. చిరంజీవి కి పోటీగా నువ్వు సినిమాలు విడుదల చేయవు. నువ్వు వేరే సినిమాలు చేసుకో. మనం ఎప్పుడైనా చేద్దాం ఇది వేరే హీరోతో చేస్తాను అని దిల్ రాజు అన్నాడట. అలా ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి కారణంగా సాయి తేజ్ "శతమానం భవతి" సినిమాను మిస్ చేసుకున్నట్లు అయింది.