కేవలం ప్రేమ వ్యవహారాలు మాత్రమే కాదండోయ్.. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ కి మాత్రమే చెప్పుకోవాల్సిన పర్సనల్ విషయాలను కూడా పలు ఇంటర్వ్యూలలో ఓపెన్ అవుతూ చెప్పేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన లవ్ గురించి ఇలాంటి విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్నాన్ని ని ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే ఎన్నో రోజులపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. పెళ్లితో ఒక్కట్టయ్యారు . ప్రస్తుతం ఎంతో హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఒకవైపు కెరియర్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన ఎక్స్ లవ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. రిలేషన్షిప్ వ్యాల్యూ తెలియక గతంలో ఒక చిన్న కారణంతో తనను ప్రేమించిన వ్యక్తిని రిజెక్ట్ చేశాను అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ తెలిపింది. హోటల్ లో నాకోసం అతను ఆర్డర్ చేసిన ఫుడ్ నచ్చలేదు. నేను కోరిన ఫుడ్ ని తక్కువ చేసి చూసాడు. దీంతో బ్రేకప్ చెప్పేసాను. నా భోజనాన్ని జీవనశైలిని పంచుకోలేని వ్యక్తి నాకు అనవసరం అని అనిపించింది అంటూ తన మాజీ లవర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.