ఇక ఎప్పుడు మరికొన్ని సినిమాలు షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఇంకొన్ని సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ హను రాఘవపూడి తో ఒక మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారట. ఇలాంటి సమయంలో సమంత ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ ని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలో సమంతను తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా.. ఇప్పటికే ఇమ్మాన్విని మొదటి హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అయితే సమంతను రెండో హీరోయిన్గా సెలెక్ట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో నటించిన ప్రభాస్ అటు సమంతతో మాత్రం కలిసిన నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్ బాగుంటుందని.. అంతే కాకుండా ఫ్రెష్ గా అనిపిస్తుందని అభిమానులు అనుకుంటున్నారట. ఇక సమంత కూడా ఈ మధ్య కాలం లో ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించలేదు. దీంతో ఇక ప్రభాస్ సినిమా లో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని కోరుతున్నారట అభిమానులు. అయితే ఇప్పటికే రెండో హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేసే ప్రక్రియ పూర్తయిందట. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన కూడా వస్తుందట.