బుల్లితెరపై ఏం నడుస్తుందనే కమర్షియల్ యాడ్ వస్తూ ఉంటుంది .. అయితే చిత్ర పరిశ్రమలో మాత్రం ఇప్పుడు ఏం నడుస్తుంది అని అడిగితే మాత్రం రష్మిక టైం గట్టి గా నడుస్తుంది అని చెప్పటం లో ఎలాంటి సందేహం లేదు .. వరస విజయాల తో అదరగొడుతుంది నేషనల్ క్రష్ .. య‌నిమల్ తో బాలీవుడ్ ని ఒక ఉప్పు ఉపేసింది .. పుష్ప 2 తో మరోసారి దంచి కొట్టింది .. ఇప్పుడు బాలీవుడ్ లో చావ తో ఇంకో బ్లాక్ బస్టర్ అందుకుంది .


విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది .. ఈ శుక్రవారం రీలీజ్‌ అయినా ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది .. తొలిరోజు 30 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .. ఈ సంవత్సరం బాలీవుడ్లో మొదటి రోజు కలెక్షన్ లో ఇదే హైయెస్ట్ రికార్డ్ .. విక్కీ కౌశల్ సినిమాకి ఇంతటి ఓపెనింగ్స్ రావడం కూడా ఇదే మొదటిసారి .. అలాగే విక్కీ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి .. యాక్షన్స్ సన్నివేశాల్లో విక్కి ఇరగదీసాడు .. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్లో తన విశ్వరూపం చూపించాడు .. ఔరంగజేబ్ గా నటించిన అక్షయ్ కన్నా సైతం తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రగా నటించాడు .


ఇక ఈ రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో ఇంత క్వాలిటీ మేకింగ్ తో సినిమా రాలేదని చాలామంది విశేషకులు అంటున్నారు .. ఈ విజయంతో బాలీవుడ్ లో రష్మిక మరో మెట్టు పైకి ఎక్కినట్టే .. ఇప్పుడు రష్మిక సౌత్‌ సినిమాలు కంటే బాలీవుడ్ సినిమాలు పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడానికి ఇష్టపడుతుంది. సల్మాన్ ఖాన్ , మురగదాస్ కాంబోలో వస్తున్న సికిందర్ సినిమాల్లో కూడా రష్మిక నటిస్తుంది .. ఈ సినిమా కాక బాలీవుడ్ లో మరో భారీ సినిమాను కూడా ఓకే చేసింది .. దానికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో రానున్నాయి .. ఇక టాలీవుడ్ లో ధనుష్ కు జంటగా కుబేరలో నటిస్తున్న విషయం తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: