సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా చాలా కామన్ మేటర్.  కానీ స్టార్ హీరోల విషయంలో మాత్రమే ఇది కామన్ గా తీసుకోరు అభిమానులు . మరి  ముఖ్యంగా ఒక బిగ్ బడా స్టార్ హీరో చేయాల్సిన సినిమాను మరొక బిగ్ బడా స్టార్ హీరో చేస్తే మాత్రం అది నిజంగా సెన్సేషనల్ అనే చెప్పాలి . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే ఇప్పుడు యంగ్ హీరోస్ మధ్య కన్నా కూడా సీనియర్ హీరోస్ మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉంది.
 

రీసెంట్గా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా 100 కోట్లు క్రాస్ చేశాడు విక్టరీ వెంకటేష్. బాలయ్య  డాకు మహారాజ్ తో అద్దిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.  అయితే రామ్ చరణ్ మత్రం "గేమ్ చేంజర్" సినిమాతో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. పెట్టిన దానికి పైసా కూడా  రాకుండా చేతులెత్తేసింది . అలా తయారయ్యింది ఇండస్ట్రీలో పరిస్థితి .



కాగా  ప్రజెంట్ సోషల్ మీడియాలో చిరంజీవి విశ్వంభర సినిమాను వదులుకున్న స్టార్ సీనియర్ హీరో పేరు మారుమ్రోగిపోతుంది . ఆయన మరెవరో కాదు బాలయ్య . యస్ నందమూరి బాలకృష్ణ తోనే డైరెక్టర్ వశిష్ట విశ్వంభర సినిమాని  చేయాలనుకున్నారట . కానీ బాలయ్యకు ఆ కాన్సెప్ట్ నచ్చక రిజెక్ట్ చేసారట. బాలయ్య రిజెక్ట్ చేసిన కథతో ఇప్పుడు చిరంజీవి హిట్ అందుకోబోతున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. కానీ సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో విశ్వంభర సినిమాను బాలయ్య వదులుకుంటేనే చిరంజీవి చేతికి వెళ్ళింది అన్న వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: