న్యాచురల్ స్టార్ నానికి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా సినిమాకు అంతకంతకూ ఎదుగుతున్న నాని భవిష్యత్తు సినిమాలతో సైతం భారీ విజయాలను అందుకుంటాననే కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు. నాని హిట్3 సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
హిట్3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. హిట్3 సినిమా చేస్తానని తాను అనుకోలేదని ఇది ప్లాన్ చేసింది కాదని నాని అన్నారు. హిట్2 చివర్లో క్యామియో క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ అనడంతో తాను చేయాల్సి వచ్చిందని నాని చెప్పుకొచ్చారు. క్యారెక్టర్ డిజైన్, పేరు అప్పటికప్పుడు సెట్ చేసుకున్నామని నాని కామెంట్లు చేశారు.
 
అప్పటికే నా లైనప్ లో చాలా సినిమాలు ఉండటంతో హిట్3 సినిమాను తీసినప్పుడు చూద్దాం అని భావించామని నాని చెప్పుకొచ్చారు. కానీ నా లైనప్ కు సంబంధించిన ఒక సినిమా వెనక్కు వెళ్లడంతో హిట్3 సినిమాకు ఓకే చెప్పానని నాని తెలిపారు. కిల్, యానిమల్ సినిమాలు సక్సెస్ సాధించడంతో తాను హిట్3 ప్లాన్ చేయలేదని యానిమల్ సినిమా నుంచి ఇన్స్పైర్ కాలేదని సినిమా చూస్తే ఆ విషయం అర్థం అవుతుందని నాని వెల్లడించారు.
 
హిట్3 సినిమాలో పరిశోధనకు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉందని నాని పేర్కొన్నారు. సినిమలో పరిశోధన సాగిసాగి చివరకు వయొలెన్స్ తప్పనిసరి అనే పరిశితి వస్తుందని ఆయన కామెంట్లు చేశారు. నాని రెమ్యునరేషన్ 35 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నాని హిట్3 సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: