
అక్కినేని హీరో నాగచైతన్య , సమంత విడాకులు తీసుకుని చాలా కాలం అవుతోంది. సామ్ తో విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే సామ్ శోభిత కు కనెక్ట్ అయిపోయాడు. వాళ్లిద్దరు కూడా కొంత కాలం ప్రేమించుకుని పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు సామ్ ఒక్కటే ఒంటరిగా ఉంది. ఆమె ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ ఉంది. అయితే ఆమె దర్శకద్వయం లో ఒకరు అయిన రాజ్ నిడుమోరు తో ప్రేమలో ఉందని.. వీరిద్దరు గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారని... వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరు చెట్టా పట్టాలేసుకుని మరీ తిరుగుతున్నారు. చేతిలో చేయి వేసుకుని ఓ క్రీడా కార్యక్రమానికి సైతం హాజరు అయ్యారు.
దీంతో వీరిద్దరి బంధం ఏ స్థాయిలో ఉందో తెలియడంతో పాటు వీరు తమ బంధాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకు వెళుతున్నట్టు కూడా క్లారిటీ వచ్చిందని చాలా మందికి చెపుతున్నారు. ఇక తాజాగా ఆమె 11 ఏళ్ల తర్వాత మళ్లీ శ్రీ కాళహస్తి ఆలయంలో ప్రత్యక్షం కావడంతో తమ బంధం గొప్పగా ఉండాలని కోరుకోవడంతో పాటు ఆమె నిర్మాత గా మారి తీసిన శుభం సినిమా సక్సెస్ కావాలని కోరుకుందని చెపుతున్నారు. ఇక సమంత అభిమానులు మాత్రం సమంత మళ్లీ ఫ్యామిలీ లైఫ్ లోకి రావాలని.. నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోగా .. సమంత చేసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.