సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని భలే విచిత్రంగా జరుగుతూ ఉంటాయి . కావాలనే చేస్తారో.. లేకపోతే టైం బ్యాడ్ అయ్యి అలా ఉంటుందో కొన్ని కొన్ని విషయాలు మాత్రం భలే ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక ఫన్నీ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలయ్య .. విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు .


నలుగురికి నలుగురే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు టాలెంటెడ్ . ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోలుగా సినిమాలు చేసి హిట్ కొడుతున్నారు అంటే వాళ్ల టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . అయితే బాలయ్యతో వెంకటేష్ తో నాగార్జునతో నటించిన ఒక హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించలేకపోయింది . ఆ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఆ హీరోయిన్ మరెవరో కాదు అసిన్. హీరోయిన్ అసిన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే . ఆమె అందం .. ఆమె నటన .. ఆమె టాలెంట్ అందరికీ బాగా నచ్చేస్తుంది.

 

కాగా హీరో నందమూరి బాలయ్యతో లక్ష్మీనరసింహ సినిమాలో నటించి మెప్పించింది.  హీరో వెంకటేష్ తో ఘర్షణ సినిమాలో నటించి మెప్పించింది.  హీరో నాగార్జునతో శివమణి సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకుని తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న  చిరంజీవితో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది . ఇది ఎక్కడ విడ్డూరం ..? అంటున్నారు ఫ్యాన్స్. చిరంజీవి మెగాస్టార్ మరి అలాంటి హీరోతో ఆమెకు అవకాశమే రాలేదా ..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు జనాలు . బహుశా వచ్చినా ఆమె రిజెక్ట్ చేసి ఉండొచ్చేమో అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి సోషల్ మీడియాలో మరొకసారి హీరోయిన్ అసిన్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: