నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్లో వచ్చిన చిత్రం హిట్ 3. హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హిట్, హిట్ 2 యూనివర్సిటీలో భాగంగా హిట్ 3 విడుదలయ్యింది. ఈ చిత్రంలో హీరో నాని నటన వైలెన్స్ యాంగిల్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రం హీరో నాని కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ హిట్గా నిలవడమే కాకుండా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నాని కెరియర్ లో నిలిచింది.



ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ల మార్క్ దాటిన నాని మూడవ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ చిత్రంలో నాని యాక్టింగ్ చూసి సినీ సెలబ్రెటీలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన మిక్కీ జే.యయర్  అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ తో సినిమాని ఆకట్టుకునేలా చేశారు. హిట్ 3 ట్రైలర్ పరంగా భారీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేర్ చేసింది. ముఖ్యంగా rrr సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు 24 గంటల వ్యవధిలో 20.45 మిలియన్ వ్యూస్ రాగ కానీ నాని హిట్ 3 ట్రైలర్ మాత్రం ఏకంగా 21.3 విలియం వ్యూస్ రాబడ్డాయి.



సినిమా చివరిలో కూడా హిట్ 4 సినిమా కంటిన్యూ ఉన్నట్లు చూపించారు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ 3 సినిమా విడుదల ముందు వరకు నాని అంటే కేవలం లవర్ బాయ్ ,ఫ్యామిలీ బాయ్ వంటి సినిమాలను మాత్రము చేస్తారనుకునే వారికి తనలో సరికొత్త నటనను బయటపెట్టారు. ప్రస్తుతం నాని సినిమాల విషయానికి వస్తే.. ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉండగా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా సరికొత్త కాన్సెప్ట్ తోనే రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: