
అలాగే ఈ సినిమాని రీమేక్ చేయాలని నాగార్జున కూడా జూనియర్ ఎన్టీఆర్ , నాగచైతన్యకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు .. ఇక దీని గురించి నాగార్జున ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు .. గుండమ్మ కథ రీమిక్ పై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగినట్టు అగ్ర నటుడు మురళీమోహన్ కూడా చెప్పారు .. అందరూ ఓకే అనుకున్న తర్వాత అక్కినేని నాగేశ్వరరావు ఒపీనియన్ తీసుకోవాలని ఆయన చెప్పారు .. అయితే అప్పుడు గుండమ్మ కథ రీమిక్ చేసేందుకు నాగేశ్వరరావు నో చెప్పారు .. అలానే వారిని ఒక ప్రశ్న అడిగారు .. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను పెడతారు .. నా పాత్రలో నాగచైతన్య నటిస్తారు .. అలా అనే హీరోయిన్లు కూడా ఎవరో ఒకరు తీసుకుంటారు అది కూడా మంచిదే .. కానీ సినిమాకు కీలకంగా ఉన్న సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రలో ఎవరిని తీసుకుంటారు అని ప్రశ్నించారు . నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకి ఎవరి దగ్గర సమాధానం లేదు అని మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ..
ఇక గుండమ్మ కథ సినిమాలో చాలా భాగం కథ ఆమెపైనే ఉంటుంది . ఎన్టీఆర్ , చైతన్య నటనని ఎవరు విమర్శించారు .. కానీ గుండమ్మ పాత్రలో ఎవరో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను తీసుకువచ్చిపెట్టి ఆమె సరిగాా నటించకపోతే సూర్యకాంతం తో పోల్చి తిడతారు అని అందరికీ అర్థమైంది .. అందుకే గుండమ్మ కథ రీమిక్ ఆగిపోయిందని మురళీమోహన్ చెప్పారు .. ఈ క్లాసికల్ సినిమాల రీమేక్ చేయాలనే డిమాండ్ అభిమానుల వైపు నుంచి వస్తూనే ఉంది .. అలాగే జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో దానవీరశూరకర్ణ సినిమాని రీమేక్ చేయాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు ..