సినీ ఫీల్డ్ లో ఉండే చాలామంది హీరోయిన్లను  అభిమానులు ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది వారిపై విపరీతమైన లవ్ పెంచుకుంటారు. అయితే అభిమానులే లవ్ పెంచుకోవడం కాకుండా సినీ ఫీల్డ్ లో ఉంటే ఇతర హీరోలు కూడా హీరోయిన్ల పై మనసు పడుతూ ఉంటారు. అలా మనసు పడ్డ కొంతమంది లవ్ సక్సెస్ అయి పెళ్లి వరకు వెళ్తుంది. కానీ మరి కొంతమందిది మధ్యలోనే సమసీ పోతుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా  స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి ముందు ఆ హీరోయిన్ తో విపరీతమైన లవ్ లో పడ్డారు. చివరికి ఛాన్స్ దొరికితే ఆమెతో కలిసి ఉండాలనుకున్నారట.. ఆమె కోసమాయన కన్నీరు కూడా కార్చారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే వివరాలు చూద్దాం..

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్లలో శ్రీదేవి కూడా ఒకరు. అప్పట్లో ఈమె కుర్రకారుకు కలల రాకుమారి.. అలాంటి ఈమెను ఎంతోమంది హీరోలు లవ్ చేసి పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. కానీ చివరికి ఆమె బోనీకపూర్ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అయిపోయింది. అలాంటి శ్రీదేవిని  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా ఇష్టపడ్డారట. తన లవ్ ను ఒక్కసారైనా ఆమెతో చెప్పాలని అనుకున్నారట. కానీ ఆ సమయం రాలేదని చెప్పుకొచ్చారు. అయితే శ్రీదేవి బోనీ కపూర్ ను పెళ్లాడే సమయంలో నేను చాలా ఏడ్చానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

ఆరోజు ఇంట్లో నుంచి బయటకు రాలేదని నా హార్ట్ బ్రేక్ అయిందన్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో నేటిజన్స్ స్నేహ రెడ్డిని మోసం చేద్దామనుకున్నావా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక శ్రీదేవితో ఆయన ప్రేమను పంచుకోలేకపోయినా కానీ తన కూతురుతో సినిమాలో నటించే అవకాశం మాత్రం దక్కబోతోందని తెలుస్తోంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: