మహేష్ బాబు ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. రాజకుమారుడు సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆ సినిమాతో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. ఆ సినిమా అనంతరం మహేష్ బాబు తన సినిమాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. మహేష్ష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మహేష్ బాబు తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

సినిమా షూటింgగ్ ను చాలా వేగంగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా.... మహేష్ బాబుకి విపరీతంగా అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మహేష్ బాబుకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తనకు, తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. వరుసగా ఫోటోషూట్ చేస్తూ అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా హాట్ టాపిక్ గా మారుతాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు అభిమాని ఒకరు తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోను తన పెళ్లి పత్రికపై ముద్రించుకొని తన ఇష్టాన్ని చాటుకున్నారు. శుభలేఖపై ఎవరైనా సరే దేవుడి ఫోటోలను తప్పకుండా వేసుకుంటారు. కానీ ఇతను దేవుడి ఫోటోలతో పాటు మహేష్ బాబు ఫోటోలు కూడా చిత్రీకరించారు. ఈ పెళ్లి పత్రికను మహేష్ బాబు అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి పత్రికపై మహేష్ బాబు ఫోటోను చూసి తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో మహేష్ బాబుకి తప్పకుండా చేరాలని వైరల్ చేస్తున్నారు. దీనిపై మహేష్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: