యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెమొరీ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మాటలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి అంటూ నాగచైతన్య తాజాగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
 
దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జపాన్ కు వెళ్లిన తారక్ మా రెస్టారెంట్ గురించి మాట్లాడారని నాగచైతన్య అన్నారు. హైదరాబాద్ లోని షోయులో జపనీస్ ఫుడ్ దొరుకుతుందని జపనీస్ ఫేమస్ ఫుడ్ సుషీ ఇక్కడ చాలా బాగుంటుందని తారక్ చెప్పారని నాగచైతన్య వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియొను చూసి ఆరోజు నాకెంతో ఆనందంగా అనిపించిందని చైతన్య పేర్కొన్నారు.
 
షోయు గురించి గతంలో ఒక సందర్భంలో మాట్లాడిన నాగ చైతన్య లాక్ డౌన్ సమయంలో ప్రీమియం క్లౌడ్ కిచెన్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని చెప్పుకొచ్చారు. అలా పుట్టిందే మా రెస్టారెంట్ అని ప్రస్తుతం మంచిగా సాగుతోందని నాగచైతన్య పేర్కొన్నారు. నాగచైతన్య తండేల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.
 
నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య పారితోషికం సైతం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుని కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం కెరీర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తారక్ కు కెరీర్ బెస్ట్ హిట్లు దక్కాలని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. 2025 సంవత్సరంలో వార్2 సినిమాతో తారక్ బాక్సాఫీస్ షేకయ్యే హిట్ సాధిస్తారేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: