బాలీవుడ్లో ప్రముఖ నిర్మాత శ్రీదేవి భర్త బోని కపూర్ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి. సీనియర్ హీరో  గా పేరుపొందిన  అనిల్ కపూర్ తల్లి నిర్మల కపూర్ ఇటీవలే గడచిన కొన్ని గంటలకు మరణించారు.. నిర్మాత బోని కపూర్, సంజయ్ కపూర్లకు నిర్మల కపూర్ తనయలు అన్న సంగతి అందరికీ తెలిసిందే.. తల్లి మరణ వార్తతో ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నిర్మల కపూర్ వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు ఈమె మరణానికి సంబంధించి వార్త నిన్నటి రోజున సాయంత్రం అధికారికంగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.


బాలీవుడ్ సెలబ్రిటీల సైతం వార్త విన్న తరువాత చాలామంది సెలబ్రిటీలు సైతం కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. నిర్మల కపూర్ గత కొద్దిరోజులుగా ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందట. అయితే వృద్ధాప్య సమస్యల కారణం చేత కొద్దిరోజుల నుంచి చికిత్స పొందుతున్న నిర్మలా కపూర్ నిన్నటి రోజున తుది శ్వాస విడిచారు. గత ఏడాది సెప్టెంబర్ 27న ఈమె చివరి పుట్టినరోజు కుటుంబ సభ్యులు చాలా గ్రాండ్ గా జరుపుకున్నట్టు తెలుస్తోంది.. తన తల్లితో దిగినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో అటు సంజయ్, బోనీ కపూర్ కూడా కనిపించారు.


కుటుంబం మొత్తం కలిసి తన తల్లి పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా చేస్తున్నట్లుగా కనిపించారు. ఇక అనిల్ కపూర్ భార్య సునీత తో పాటుగా బోనీకపూర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో పాటుగా సంజయ్ కపూర్ కూతురు షనాయ కూడా ఈ ఫోటోలలో కనిపించారు. 2011లో బోనీ, సంజయ్ కపూర్, అనిల్ తమ తండ్రిని కోల్పోయారు. ఇక వీరి తండ్రి సురిందర్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లేటప్పుడు ఎన్నో కష్టాలను కూడా చవిచూశారు. అలా నెమ్మదిగా ఎదుగుతూ మంచి పేరు సంపాదించారు. తమ కుమారులకు మంచి భవిష్యత్తు ఉండాలని కష్టపడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: