ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు అన్న దానికి మరో బిగ్ ఎగ్జాంపుల్ గా మారిపోయాడు హీరో నాని . "అష్టాచమ్మా" అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు , అయితే ఆయన అసిస్టెంట్ డైరెక్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడు నాని కి చాలామంది హీరో అవ్వు అంటూ సజెషన్స్ ఇచ్చారట . కానీ నాని అవి పెద్దగా పట్టించుకోలేదట . అంతేకాదు తన ఫ్రెండ్స్ మరింత ఫోర్స్ చేస్తూ ఉండడంతో హీరోగా ట్రై చేశారట నాని . ఆ తరువాత తన టాలెంట్ తో ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు.


అయితే నాని హీరోగా ట్రై చేస్తున్నా మూమెంట్లో చాలా చాలా అవమానాలు ఎదుర్కొన్నారట . నువ్వు ఇండస్ట్రీలోకి సెట్ కావు.. నీ ఫేస్ కి అంత సీన్ లేదు .. ఇండస్ట్రీలో హీరో అయ్యే ఫేస్ నేనా  నీది.. ఇలా రకరకాలుగా మాట్లాడారట . అంతేకాదు నాని ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిన తర్వాత హిట్స్ కొట్టిన తర్వాత కూడా చాలామంది హీరోయిన్స్ ఆయనతీ నటించాలి అంటే భయపడ్డారట.  ఎంసీఏ తర్వాత నాని సినిమా రికార్డ్స్ అంత బాగాలేదు.  నాని నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న మూమెంట్లో ఓ హీరోయిన్ నానితో మూడుసార్లు సినిమా చేసే అవకాశం వచ్చిన మూడు సార్లు రిజెక్ట్ చేసిందట.



దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు.."రష్మిక మందన్నా". ఎస్ నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా నానితో మూడుసార్లు సినిమా చేసే అవకాశం దక్కించుకుందట. కానీ మూడుసార్లు ఆమె వాలీడ్ రీజన్ తోనే ఆ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసిందట.  సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇప్పుడు నాని రష్మికకు మించిన స్థాయిలోనే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . రీసెంట్ గా నాని నటించిన హిట్ 3 మూవీ ఏ విధంగా కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందో అందరికీ తెలిసిందే . ఇప్పుడు నాని పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: