- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


దర్శకత్వంలో తమ సత్తా చాటి తమకుంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారు ఆ త‌ర్వాత హీరోలుగా మారిన సంద‌ర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో టాలీవుడ్ లో ఒక‌ప్పుడు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఉన్నారు. ఆయ‌న ముందుగా ద‌ర్శ‌కుడిగా ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు చేసి ఆ త‌ర్వాత న‌టుడిగా మారారు. ఇక న‌టుడి గా ఉన్న వాళ్లు ద‌ర్శ‌కులు అయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇక ద‌ర్శ‌క‌త్వంలో ఉండి న‌ట‌న‌పై మ‌క్కువ‌తో కొంద‌రు హీరోలు అయ్యారు. ఇప్పుడు ఉన్న యంగ్ డైరెక్ట‌ర్లు త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళుతున్నారు. న‌ట‌న‌పై కాన్ సంట్రేష‌న్ చేయ‌డం లేదు. కానీ ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఇప్పుడు హీరోగా మారుతున్న‌ట్టు త‌మిళ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో ?  కాదు లోకేష్ క‌న‌క‌గ‌రాజ్. ద‌ర్శ‌కుడిగా లోకేష్ త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.


ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఆయన తాజాగా హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడు. తానే స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందనే అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉందంటున్నారు. లోకేష్ ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా ఫ్రూవ్ చేసుకున్నారు. మ‌రి హీరోగా ఏం చేస్తారో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: