గత ఏడాది పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో రేవతి మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి చికిత్స పొందుతూ ఉన్నారు. శ్రీ తేజ్ కు ఎన్నో రకాల చికిత్సలు అనంతరం ఇటీవలే కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. రిహాబిలిటేషన్ కేంద్రంలో ట్రీట్మెంట్ను సైతం అందిస్తూ ఉన్నారు శ్రీతేజ్ కు. అయితే ఈ విషయం అటు అల్లు అర్జున్ కుటుంబానికి కొంతమేరకు ఊరట కలిగించిందని చెప్పవచ్చు. దీంతో ఇటీవలే నిర్మాత అల్లు అరవింద్, బన్ని వాసు సైతం శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.


శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని సైతం అడిగిమరీ తెలుసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీ తేజ్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు అతని యొక్క యోగక్షేమాలను సైతం అటు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో పాటు బన్నీ వాసు కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవారట. అంతేకాకుండా శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులతో పాటు అతని కుటుంబానికి అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీస్ మేకర్స్ వారు తదితర సెలబ్రిటీలతో పాటు మరికొంతమంది కూడా ఆర్థిక సహాయం చేశారు.


సుమారుగా శ్రీతేజ్ అకౌంట్లో రెండు కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేసినట్లు సమాచారం. శ్రీతేజ్ మళ్ళీ ఎప్పటిలాగే నార్మల్ పరిస్థితికి వచ్చి అందరితో కలిసి మరి స్కూల్ కి వెళ్లాలని అలాగే భవిష్యత్తులో అతనికి ఏ అవసరం వచ్చినా కూడా కుటుంబానికి అండగా ఉండేందుకు అల్లు అర్జున్ కుటుంబం సిద్ధంగానే ఉన్నారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స మొదలు ప్రస్తుతం రిహాబిలేషన్ సెంటర్లు ట్రీట్మెంట్ వరకు కూడా అన్నిటిని సైతం దగ్గరుండి అల్లు అరవింద్, బన్నీ వాసు చూసుకుంటున్నారట.ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం కూడా తేలుకున్నట్లు వైద్యులు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు  సోషల్ మాధ్యమికాలలో కనిపిస్తున్నాయి. మరి శ్రీతేజ్ ఆరోగ్యంగా మరింత కోలుకోవాలని అల్లు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: