ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఓ టి టి లోకి చాలా సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. అందులో కొన్ని క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ వారం ఓ నాలుగు క్రేజీ సినిమాలు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ నాలుగు ఏవి ..? అవి ఏ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఓదెలా 2 : తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు నుండి అనగా మే 8 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

జాక్ : సిద్దు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి చైతన్య హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి : యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ : అజిత్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: