
ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివ కుమార్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య బాబు నటిస్తున్నారనే వార్త తెగ వైరల్ అవుతుంది. బాలయ్యకు యంగ్ స్టార్స్ నుండి ఏజ్ అయిన వాళ్లదాకా ఫాన్స్ ఉన్నారు. బాలయ్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలన్ని హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగింది.
ఈ సినిమాలో బాలయ్య బాబు ఎంట్రీ పవర్ ఫుల్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య బాబు పాత్రపై మరో వార్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది. బాలయ్య బాబు జైలర్ 2 సినిమాలో ఏపీ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్త విన్న బాలయ్య ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జైలర్ సినిమాలాగే.. జైలర్ 2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుందని అర్దం అవుతుంది.