టాలీవుడ్ లో మల్టీ స్టార్లర్ చిత్రాలు ఈమధ్య కాలంలో రావడం చాలా అరుదుగా కనిపిస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న చిత్రం భైరవం. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు మల్టీ స్టార్రిగా నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.


సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు హీరోలు కలిసి చిందేసిన దమ్ దుమారే అనే పాటను కూడా విడుదల చేశారు. భోగిమంటల్లో తోసేద్దామా బాధలు అంటూ సాగేటువంటి ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో చాలా ట్రెండిగా కనిపిస్తోంది. మంచు మనోజ్ తో ఈ పాట మొదలవుతుంది. ఈ పాట ముగ్గురు అన్నదమ్ముల మధ్య స్నేహం యొక్క గొప్పతనం గురించి తెలియజేసేలా కనిపిస్తోంది.  ఈ పాట యొక్క బ్యాగ్రౌండ్ తో పాటు స్క్రీన్ ప్లే కూడా వెండితెర మీద చూసినప్పుడు చాలా అద్భుతంగా కనిపించేలా ఉన్నది. ఈ పాట సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో ఈ ముగ్గురు హీరోలు కూడా అద్భుతమైన డాన్స్ తో అదరగొట్టేశారు. భైరవం సినిమా కూడా కుటుంబ కథాంశం సినిమా అన్నట్టుగా కనిపిస్తోంది.


ఇందులో అతిథి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని కే రాధ మోహన్ నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో సీనియర్ హీరోయిన్ జయసుధ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ముగ్గురు హీరోలకి కూడా గతకొన్నేళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. మరి భైరవం సినిమాతో నైనా అటు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ సరైన సక్సెస్ ని అందుకుంటారేమో చూడాలి మరి. మొత్తానికి పాట మాత్రం ట్రెండీగా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: