టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.  నాగార్జున తన 100 వ సినిమా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో నాగార్జునకు జోడిగా మిస్ ఇండియా వరల్డ్ 2023 విజేత నందిని గుప్తా కూడా నటించబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరింత ఊహాగానాలకు దారితీసింది.


రాజస్థాన్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల నందిని గుప్తా కు సినిమాలో అవకాశాలు చాలానే వస్తున్నాయని నాగార్జున వంటి టాప్ హీరో సరసన నటించే అవకాశం కూడా అందుకున్నట్లు వినిపిస్తున్నాయి. గతంలో కూడా నాగార్జున ఐశ్వర్యరాయ్, సుస్మితసేన్ వంటి భామలకు కూడా తన సినిమాలలో అవకాశాలను కల్పించారు. ఇప్పుడు మరో మిస్ ఇండియాకి అవకాశం కల్పించడంతో నందిని జాక్ పాట్ అందుకుంది అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా ప్రకటన చేయవలసి ఉన్నది.


ప్రస్తుతం 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాదులో జరుగుతున్న వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాకు ఇలా సినిమా అవకాశాలు రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈమె 2003లో రాజస్థాన్లో జన్మించింది.ఈమె కుటుంబం వ్యవసాయ కుటుంబమే. ముంబైలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిందట. 10 సంవత్సరాల వయసులోనే మిస్ ఇండియా కావాలని దృఢమైన సంకల్పంతో కృషిచేసి 19 సంవత్సరాలకే రాజస్థాన్ నుండి పోటీ చేసి  మిస్ ఇండియా పోటీలలో 2023లో టైటిల్ని గెలుచుకుంది. అనంతరం ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలలో ఇండియాకి ప్రాతినిధ్యం వ్యవహరించడానికి మార్గాన్ని సులువు చేసింది. ఈనెల 13వ తేదీన హైదరాబాదులో చాలా గ్రాండ్ గా మిస్ వరల్డ్ పోటీలు మొదలయ్యాయి.  అవార్డు విన్నింగ్ డిజైనర్ గా పేరు పొందిన గౌరంగ్ షా రూపొందించిన దుస్తులలో నందిని అందరిని ఆకట్టుకుంది. మరి నాగార్జున సినిమాలో అవకాశం పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: