టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా ఒకప్పుడు పేరు పొందిన సమంత ఈ మధ్యకాలంలో సినిమాలో చాలా తక్కువగా కనిపిస్తోంది. అయితే ఇటీవలే నిర్మాతగా కూడా శుభం సినిమాకి వ్యవహరించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఇటీవలే హైదరాబాదులో సమంత నిర్వహించిన సక్సెస్ మీట్ లో పాల్గొని అక్కడ ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో బడా ఫ్యామిలీ గా పేరు పొందిన సురేష్ బాబు కుటుంబం తన ఫ్యామిలీకి ఏ అవసరం వచ్చినా కూడా సపోర్టుగానే ఉంటుందని చెప్పింది సమంత.


తనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న కచ్చితంగా సురేష్ బాబు ఫ్యామిలీ వద్దకే వెళ్తానని ఆయన కచ్చితంగా తనకు హెల్ప్ చేస్తారని తెలియజేసింది సమంత. అనంతరం ఈ సినిమా గురించి మాట్లాడుతూ అసలు ఈ సినిమా కోసం సమంత పెద్దగా కష్టపడలేదని.. కేవలం ప్రమోషన్స్ లో మాత్రమే పాల్గొన్నాను మిగతా పనులన్నీ కూడా టీం చూసుకున్నదని ప్రేక్షకులు ఆదరణ ప్రశంసల వల్లే శుభం సినిమా ఇంత సక్సెస్ అయ్యింది.. మేము కష్టపడినా కూడా ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే అది విజయాన్ని అందుకుంటుంది అంటూ తెలియజేసింది సమంత.


శుభం సినిమాని సక్సెస్ చేసిన ఆడియస్స్ కి కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. నిర్మాతగా తన తొలి అడుగులలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు తనకి సపోర్ట్ చేశారని తెలిపింది. అలాగే శుభం సినిమాలో కూడా సమంత అతిధి పాత్రలో కనిపించింది. మొత్తానికి సమంతకు సురేష్ బాబు ఫ్యామిలీ టాలీవుడ్లో సపోర్టివ్ గా ఉందనే విషయాన్ని తెలియజేసింది.. హర్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన శుభం సినిమా ఈనెల తొమ్మిదవ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మరి రాబోయే రోజుల్లో సమంత మరిన్ని చిత్రాలను నిర్మించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ గత కొన్ని నెలలుగా డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవలే టీమ్ కూడా అదంతా కూడా రూమర్స్ అని క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: