చాలా సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ అనే మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు పవన్ కళ్యాణ్ చాలా అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిలా పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో పవన్ కి చాలా కాలం తర్వాత అద్భుతమైన విజయం దక్కగా , హరీష్ శంకర్ కి ఈ మూవీ ద్వారా దర్శకుడిగా మంచి క్రేజ్ వచ్చింది.

ఇలా గబ్బర్ సింగ్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబోలో మరో మూవీ ఎప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అలాంటి సమయం లోనే పవన్ , హరీష్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ లో శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇకపోతే చాలా కాలం క్రితం స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ పలుమార్లు ఆగిపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్సినిమా గురించి స్పందించాడు. తాజాగా హరీష్ శంకర్ ... పవన్ కళ్యాణ్ నుంచి  అదిరిపోయే రేంజ్ సినిమాను అభిమానులకు అందించేందుకు తమ యూనిట్ ఎంతగానో ప్రయత్నిస్తుందని ... ఆయన నుంచి సూపర్ మూవీని అందించేందుకు తాము మరింత కృషి చేస్తున్నట్లు హరీష్ శంకర్ తాజాగా కామెంట్ చేశారు. ఇలా హరీష్ శంకర్ స్పందించడంతో ఒక్క సారిగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై పవన్ అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: