
మరీ ముఖ్యంగా మగరాయుడు కటౌట్ అంటూ ఎంతమంది ఆమెను అవహేళన చేస్తూ మాట్లాడారు . దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు. అది అందరికీ తెలిసిందే . అయితే శోభిత ధూళిపాల మాత్రం అది పెద్దగా పట్టించుకోవడం లేదు. తల పని తాను చేసుకుంటూ పోతుంది. కాగా శోభిత ధూళిపాళ్ల మరోసారి తమిళ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది . తమిల్ ప్రజలకి శోభిత అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. గతంలో ఎన్నో సినిమాలల్లో తన నటనా పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.
ప్రసెంట్ కోలీవుడ్ లో ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. స్టార్ట్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న "వెట్టూవన్" సినిమాలో లీడ్ క్యారెక్టర్ లో నటించబోతుందట. రంజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఇటీవల విక్రం కథానాయకుడుగా "తంగలన్" చిత్రం చేసారు . ప్రజెంట్ అనే "వెట్టూవన్" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా శోభిత ధూళిపాళ్ల కనిపించబోతుందట. శోభిత నటన ఈ సినిమాలో వేరే రేంజ్ లో ఉండబోతుంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు మూవీ మేకర్స్ . ఈ చిత్రం గ్యాంగ్ స్టార్స్ ఇతివృత్తంలో రూపోందబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అక్కినేని కోడలు పిల్లకి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు జనాలు . శోభిత ధూళిపాళ్ళ పై జరుగుతున్న ట్రోలింగ్ మొత్తం తుడిచిపెట్టుకుపోవాలి అంటే.. ఈ పాత్రలో ఆమె పూర్తి నటనను చూపించాలి అంటూ మాట్లాడుతున్నారు జనాలు. శోభిత ధూళిపాళ్ళ కి ఇది లైఫ్ టర్నింగ్ ఆఫర్ అని చెప్పుకోవడంలో సందేహమే లేదు అంటున్నారు ఆమె ఫ్యాన్స్..!